రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన బిడ్డను గెలిపించుకుందాం-ఈటల

Let’s win a tribal women as the presidential candidate-Etala
ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కావడం దేశానికి గర్వకారణమన్నారు బీజేపీ సీనియర్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తెలంగాణ ఏర్పడితే రాజ్యాంగబద్ధంగా వస్తాయనుకున్న రిజర్వేషన్లను కేసీఆర్ ఇవ్వలేదని ఈటల విమర్శించారు. గొప్ప దార్శనికత ప్రదర్శించి మోదీ… నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకోవాలన్నారు. కానీ ఇక్కడి పాలకులు అలా చేయడంలేదన్నారు. రాజ్యాధికారం వస్తే వారి బతుకులు బాగుపడుతాయని మోదీ ఆలోచన చేస్తుంటే.. ఇక్కడ మాత్రం గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములను కేసీఆర్ లాక్కుంటోందని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశంలో తెలంగాణకు కేంద్రం సహాయం చేయాలని కోరతారనుకుంటే… గుడ్డి ద్వేషంతో ఆరోపణలు చేశారని ఈటల మండిపడ్డారు. FRBM చట్టం అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా ఉంటుందని తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. టాక్స్ డెవల్యూషన్ ఫండ్స్ ను రాష్ట్రాల పరిస్థితులను బట్టి ఫైనాన్స్ కమిషన్ విడుదల చేస్తోందన్నారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా మోడీ చలవేనన్నారు. గవర్నర్ వరద ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్తే అక్కడ ఎస్పీ, కలెక్టర్ లేరని… ఇది గవర్నర్‌ను అవమానించడమేనన్నారు. గవర్నర్‌ను అవమానిస్తే.. యావత్ తెలంగాణను అవమానించినట్లేనన్నారు.