National

NSE మాజీ ఎండీ చిత్రా రామకృష్ణను అరెస్టు చేసిన ఈడీ

Share with

ఉద్యోగుల ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారానికి సంబంధించిన  మనీలాండరింగ్ కేసులో NSE మాజీ ఎండీ చిత్రారామకృష్ణను ఈడీ అరెస్టు చేసింది. 4 రోజుల పాటు ఆమె ఈడీ కస్టడీలో ఉండనున్నారు. అయితే ఆమె ఇప్పటికే NSE కో-లోకేషన్ కుంభకోణం సహా NSE సమాచారాన్ని ఓ అదృశ్య వ్యక్తికి అందించారనే ఆరోపణలతో సీబీఐ అదుపులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇప్పుడు అక్కడ నుండి ఆమెను ప్రస్తుతం ఈడీ అదుపులోకి తీసుకుంది. అదే విధంగా ఎన్ఎస్ఇ మాజీ ఉన్నతాధికారులైన రవి నరేన్, చిత్రారామకృష్ణలు తమ ఉద్యోగుల ఫోన్‌లను ట్యాపింగ్ చేయించారని… దానికి మాజీ పోలీస్ కమిషనర్ సంజయ్ పాండే సహాయం తీసుకున్నారని ఇటీవల సీబీఐ కూడా ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.