NationalNews

నాపేరు మార్చుకున్నా-ద్రౌపదీముర్ము

Share with

భారత నూతన రాష్ట్రపతిగా అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన ద్రౌపది ముర్ము ఒక కొత్త విషయాన్ని బయటపెట్టారు. తన సొంతపేరు ద్రౌపదీ కాదని, తన తల్లిదండ్రులు పెట్టిన పేరు పుటి అని వెల్లడించారు. తాజాగా ఒక వీడియో మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ తనకు ద్రౌపది పేరును స్కూల్ టీచర్ పెట్టారని చెప్పారు. తాను గిరిజన సంతాలీ సంప్రదాయానికి చెందిన వ్యక్తినని, వారి తెగలో ఆడపిల్లకు బామ్మపేరు, అబ్బాయి అయితే తాత పేరు. పెడుతూ ఉంటారని చెప్పారు. వివాహానికి పూర్వం తనపేరు ద్రౌపదీ తుడు అని, వివాహం తర్వాత మెట్టినింటి పేరు కలిసి, ద్రౌపది ముర్ముగా మారిందని తెలియజేసారు.

తనకు ఎవరూలేరని భర్తను కోల్పోయానని, తన పెద్దకొడుకు రోడ్డుప్రమాదంలో చనిపోయినప్పుడు ఎంతో ఒత్తిడికి గురైనానని, దానినుండి తేరుకోకముందే చిన్నకుమారుడు మరణించాడని దానితో తన జీవితంలో పెను సునామీ సంభవించినట్లయిందని ఉద్వేగానికి లోనైనారు. జీవితం తనకెన్నో పాఠాలు నేర్పిందని, సంతోషమైనా, బాధైనా అన్నీ జీవితంలో ఒక భాగంగా అనుకుంటూ ముందుకు సాగానని చెప్పుకున్నారు మన దేశ మెదటి మహిళ.