NationalNews

నాడు టీచరమ్మ… నేడు దేశానికి తొలి ఆదివాసీ రాష్ట్రపతి?

బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా మహిళ… ఆదివాసీ తెగకు చెందిన ద్రౌపది ముర్మును ఎన్డీఏ పక్షాలు ప్రకటించాయ్. స్వాతంత్ర్యానందరం జన్మించిన మహిళ దేశానికి రాష్ట్రపతి కానున్నారు. 64 ఏళ్ల ముర్ము గతంలో జార్ఖండ్ గవర్నర్‌గా పని చేశారు. 2015 నుంచి 2021 వరకు జార్ఖండ్ గవర్నర్‌గా వ్యవహరించారు. ద్రౌపది ముర్ము 20 జూన్ 1958న ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా బైదాపోసి గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్ తుడు. ద్రౌపది గతంలో ఒడిశా సంకీర్ణ సర్కారులో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మార్చి 6, 2000 నుండి ఆగస్టు 6, 2002 వరకు వాణిజ్య, రవాణాకు స్వతంత్ర రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆగస్టు 6, 2002 నుండి 2004 మే వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా సత్తా చాటారు. 2004 సంవత్సరాలలో రాయరంగపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ముర్ము… దేశంలోనే తొలి ఆదివాసి ట్రైబల్ మహిళగా రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు.