NewsTelangana

మూడేళ్లలో తెలంగాణ అన్ని అప్పులు చేసిందా?

Share with

మూడేళ్లలో తెలంగాణ అన్ని అప్పులు చేసిందా?

తెలంగాణ రాష్ట్రం చేస్తున్న అప్పులకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభ వేదికగా బదులిచ్చారు. ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కిషన్ కపూర్ ప్రశ్నకు నిర్మల సమాధానం చెప్పారు. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ తీసుకున్న రుణం మెత్తం 2 లక్షల 25 వేల 418 కోట్ల రూపాయలు. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ తీసుకున్న రుణం మెత్తం 2 లక్షల 67 వేల 530 కోట్ల రూపాయలు. 2020-21 ఆర్ధిక సంవత్సరం కంటే 2021-22 లో అదనంగా తీసుకున్న తెలంగాణ సర్కారు 42 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొంది. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ తీసుకున్న రుణం మొత్తం 3 లక్షల 12 వేల 191 కోట్ల రూపాయలు. 2021-22 ఆర్ధిక సంవత్సరం కంటే 2022-23 సంవత్సరంలో అదనంగా తీసుకున్న రుణం 45 వేల కోట్ల రూపాయలని… కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మరోవైపు తెలంగాణను కేసీఆర్ అప్పులు ఊబిలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎఫ్.ఆర్.బి.ఎం పరిధి చూపించకుండా అప్పులు చేస్తున్నారన్నారు. అప్పులతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు.