NationalNews

రాష్ట్రపతి ఎన్నికలో విజేత ఎవరు?

Share with

ఢిల్లీలో  రాష్ట్రపతి ఎన్నికలు సజావుగా ముగిసిన విషయం తెలిసిందే. వాటికి సంబందించిన ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఎర్పాట్లు చేయగా , అన్ని రాష్ట్రల నుండి బ్యాలెట్ బాక్సులు ఇప్పటికే పార్లమెంట్‌లోని 63 వ నంబర్ గదిలోకి చేర్చారు. గురువారం ఉదయం 11 గంటలకు లెక్కింపు ప్రారంభించనున్నారు.

ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవికాలం ఈ నెల 24న ముగియనుండగా , 15వ రాష్ట్రపతి పదవి కొరకు అధికార ఎన్డీయే అభ్యర్ధిగా గిజిజన మహిళ ద్రౌపతి ముర్ము నిలవగా , విపక్షాల ఉమ్మడి అభ్యర్దిగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యశ్వంత్ సిన్హా పోటి చేసిన విషయం తెలిసిందే.  ఈ ఇద్దరిలే  దేశానికి 15వ రాష్ట్రపతి ఎవరౌతారో అన్న అంశంపై ఇప్పటికే కొన్ని అంచనాలు వస్తున్న తరుణంలో ముర్ము విజయం సాధిస్తారని కొందరు రాజకీయ పండితులు తేల్చిచేప్పారు.