ముంబై పోలీస్ కమిషనర్‌గా వివేక్ పన్సల్కర్
మహారాష్ట్రలో వేగంగా మారుతున్న రాజకీయాలు హీట్ పుట్టిస్తుటే… ముంబైకి కొత్త పోలీస్ కమిషనర్ వచ్చారు. 1989 ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్ వివేక్ పన్సల్కర్ ను కొత్త బాస్ గా నియమించారు. ప్రస్తుత పోలీస్ హౌసింగ్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్న ఆయన… సంజయ్ పాండే రిటైర్ కావడంతో నియమితులయ్యారు. గతంలో వివేక్ మహారాష్ట్రలో అనేక కీలక పదవులు నిర్వర్తించారు. థానే కమిషనర్, మహారాష్ట్ర ఏటీఎస్‌గాను పనిచేశారు.