ఇవాళ షిండే సర్కారుకు బల పరీక్ష
ఏ రోజూ ముఖ్యమంత్రి పదవి కోరుకోలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన రెబల్ నాయకుడు ఎక్‌నాథ్ షిండే చెప్పారు. ఇవాళ మహారాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నేపథ్యంలో… విజయంపై ఆయన దీమాగా ఉన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన స్పీకర్ రాహుల్ నర్వేకర్ బలపరీక్ష నిర్వహించనున్నారు. విశ్వాస పరీక్షలో షిండే సర్కారు విజయం నల్లేరు మీద నడకేనన్న భావన ఉంది. ఇప్పటికే స్పీకర్ ఎన్నికలో విజయం సాధించిన బీజేపీ, శివసేన రెబల్ కూటమి… బలపరీక్షలో నెగ్గి సత్తా చాటుకోవాలని భావిస్తోంది. శివసేన శాసనసభాపక్ష నాయకుడిగా అజయ్ చౌదరిని తొలగించి… ఎక్ నాథ్ షిండేను ఆ స్థానంలో నియమించినట్టు ప్రకటన విడుదల చేశారు. భరత్ గొగావాలెను చీఫ్ విప్ గా నియమించి… థాక్రే వర్గానికి చెందిన సునీల్ ప్రభును ఆ పోస్టు నుంచి తొలగించారు.