NationalNews

శివ సేనకు చెమట్లు

Share with

బీజేపీ వేస్తున్న అడుగులు శివ సేనకు మైండ్ బ్లాక్ అయ్యేలా కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో వాస్తవానికి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని… ఏక్ నాథ్ షిండే వర్గం మద్దతు ఇస్తుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా బీజేపీ స్ట్రాటజీ మార్చింది. తమకు అధికారం మత్రమే ముఖ్యం కాదని… అపవిత్ర పొత్తులకు చెక్ పెట్టాలనే… రంగం లోకి దిగామన్న ఇంప్రెషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు… ఇది మహారాష్ట్రలో బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి సీఎం పదవిని ఏక్ నాథ్ షిండే కు ఇవ్వడం ద్వారా… శివ సేన చీఫ్ ఉద్ధవ్ అహాన్ని దెబ్బ తీయాలని బీజేపీ భావిస్తోంది. త్వరలో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ సన్నద్ధమవుతోంది. 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగే మహారాష్ట్ర ఎన్నికల్లోనూ విజయం సాధించడం కూడా బీజేపీ అసలు అలోచనగా ఉన్నట్టు సమాచారం.