Home Page SliderNational

సెల్ఫీల మోజులో ‘గోల్డ్ ఐ’ పోన్ పోగొట్టుకున్న బ్యూటీ

Share with

అసలే భారత్-పాక్ మ్యాచ్. దీనికి తోడు అభిమానుల సెల్ఫీల మోజు.  ఈ హడావుడిలో తన 24 క్యారెట్ల గోల్డ్ ఐఫోన్‌ను పోగొట్టుకున్నారు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీరౌతేలా. శనివారం అహ్మదాబాద్‌లో జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో సందడి చేసిందామె. టీమ్ ఇండియాను సపోర్ట్ చేస్తూ హుషారుగా కనిపించారు. ఆమెను గుర్తు పట్టిన అభిమానులు దగ్గరకి వచ్చి సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈ గందరగోళంలో ఆమె చేతిలోని గోల్డ్ ఐఫోన్ మిస్ అయ్యింది. తన ఫోన్ పోయిందని అహ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరికైనా దొరికితే ఇమ్మని విజ్ఞప్తి చేశారు. ఆమె ప్రస్తుతం తెలుగు సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో చిరంజీవితో కలిసి  ‘వేరీజ్ ది పార్టీ’ అంటూ డ్యాన్స్ చేశారు. ‘ఏజెంట్’, ‘ బ్రో’ చిత్రాలలో కూడా తన నృత్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.