ఫలిస్తున్న రాజన్న రాజీనామా!
మునుగోడు ఉప ఎన్నికలో పోస్టర్ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. మునుగోడులో వారం రోజులుగా రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి .. ఇవాళ రాజగోపాల్ రెడ్డికి అనుకూల పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం పరిసర ప్రాంతాలు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అనుకూల పోస్టర్లతో నిండిపోయాయి. ఫలిస్తున్న రాజన్న రాజీనామా పేరుతో పోస్టర్లను అంటించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ప్రజల కలలు నెరవేరుతున్నాయని.. ప్రతి గ్రామానికి 20 లక్షల నిధులు వచ్చాయని పోస్టర్లు వేశారు. చౌటుప్పల్‌లో 5 డయాలసిస్ యూనిట్లతో పాటు హుటాహుటిన చేనేత బీమా ప్రకటించారంటూ పోస్టర్లు వెలిశాయి.

