NewsTelangana

టీఆర్ఎస్ ను ఓడించేది బీజేపీయేనంటున్న రాజగోపాల్ రెడ్డి

Share with

ఉప ఎన్నిక వస్తే … గెలవాలని కేసీఆర్ మునుగోడు రివ్యూలు చేస్తున్నారన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల మినహా మిగతా నియోజకవర్గాలపై టిఆర్ఎస్ ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తోందన్నారు. మిగతా నియోజకవర్గాలు తెలంగాణలో లేవా..? ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధికి నిధులు ఇస్తరా.. ? అంటూ రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో ఇతర నాయకులను కొని గెలిచేందుకు కుట్ర చేస్తున్నారు. పూర్తి మెజారిటీ ఉన్నా.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం ఏముందన్నారు. ?

ప్రెస్ లో గిట్టని వ్యక్తులు, టీఆర్ఎస్ నేతలు తన గురించి వ్యతిరేక వార్తలు రాయించారన్నారు. మునుగోడులో ఉప ఎన్నిక రావాలని తాను కోరుకోవడం లేదన్నారు. ఎన్నికలు రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారన్నారు. పార్టీలు మరబోనన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికే ఓటు వేశానన్నారు. కాంగ్రెస్ అంటే అభిమానం..సోనియా గాంధీ అంటే గౌరవమన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా… సైలెంట్ గా ఉన్నానన్నారు. ఆవేదనతో కొన్ని సార్లు మాట్లాడినా.. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదన్నారు.

తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వారికి కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తే…ఏం చేయలేక ఇన్ని రోజులు ఏం మాట్లాడలేదన్నారు. పార్టీ మారాల్సి వస్తే.. నియోజకవర్గ ప్రజలతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు కోమటిరెడ్డి. కేసీఆర్ వ్యూహంలో పావును కాదలుచుకోలేదన్నారు. కాంగ్రెస్ బలహీన పడిందన్న రాజగోపాల్ రెడ్డి… కేసీఆర్ ను ఓడించే బలం బీజేపీకి ఉందని చాలా సార్లు చెప్పానని గుర్తుచేశారు.