Home Page SliderTelangana

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రామచంద్ర పిళ్లై కవితకు బినామీ

అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. 17 పేజీల రిపోర్టులో ఈడీ సంచలన విషయాలను పేర్కొంది. కవిత ఆదేశాల మేరకు పిళ్లై పనిచేశారంది. ఇండో స్పిరిట్ కంపెనీ ఏర్పాటులో ఆయన కీలక పాత్రపోషించారంది. మూడున్నర కోట్లు పెట్టుబడి పెట్టినట్టు పిళ్లై కాగితాలపై లెక్కలు చూపరని ఈడీ అభిప్రాయపడింది. లిక్కర్ స్కామ్‌లో హవలా మనీ గుట్టు విప్పేందుకు విచారించాలని ఈడీ తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో పిళ్లై ఆది నుంచి కీలకంగా వ్యవహరించారని వివరించింది.