NewsTelangana

కేసీఆర్‌పై బండి వ్యాఖ్యల దుమారం

Share with

సీఎం కేసీఆర్… ఇవాళ, రేపో ఈడీ విచారణకు సిద్ధంగా ఉండాలంటూ మరోసారి కామెంట్ చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్… కేసీఆర్ త్వరలోనే జైలుకు వెళ్తారని గత కొంతకాలంగా వ్యాఖ్యానిస్తున్న సంజయ్… తాజాగా చేసిన వ్యాఖ్యలు అటు బీజేపీలోనూ, ఇటు టీఆర్ఎస్ పార్టీలోనూ చర్చనీయాంశమయ్యాయ్. ఏదైనా సమాచారం లేకుండా సంజయ్ ఇలాంటి కామెంట్స్ చేస్తారా అని నేతలు చర్చించుకుంటున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో… కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ విచారిస్తున్న తరుణంలో కేసీఆర్ విచారణకు సిద్ధంగా ఉండాలంటూ బండి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయ్. కేసీఆర్ పై ఈడీ విచారణకు సంబంధించి… బండికి పూర్తి వివరాలు తెలిసే ఇలా మాట్లాడుతున్నారా.. లేదంటే ముందస్తు వ్యూహమా.. అసలేం జరిగిందన్నదానిపై గుసగుసలు సాగుతున్నాయ్. బీజేపీ చేతిలో ఈడీ, ఐటీ మాత్రమే ఉందంటూ గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ ముఖ్యనేతలు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని… దేనికైనా సై అంటూ సీఎం కేసీఆర్ ఇటీవల సుదీర్ఘ ప్రెస్ మీట్‌లో కుండబద్ధలుకొట్టారు.