NationalNewsNews Alert

వెంటిలేటర్‌పై రాజు శ్రీవస్తవ.. పరిస్థితి విషమం

Share with

ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవస్తవ పరిస్తితి విషమంగా మారిందని డాక్టర్‌లు తెలిపారు. నిన్న జిమ్ చేస్తూ గుండెపోటుకు గురైన ఆయన్ని వెంటనే ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో నిన్న శ్రీవస్తవ్‌కు డాక్టర్లు యాంజియో పాస్టీ నిర్వహించారు. కాగా ఈ రోజు ఆయన పరిస్థితి మరింత విషమంగా మారడంతో అతనిని వెంటిలేటర్‌పై ఉంచినట్టు , మరికొన్ని గంటలు గడిస్తేగాని ఏ విషయం చెప్పలేమని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

కమెడియన్‌గా ఆయన నిర్వహించిన ది గ్రేట్ లాఫ్టర్ ఛాలెంజ్ , కామెడీ సర్కస్ , ది కపిల్ శర్మ షో , శక్తిమాన్‌ చాలా పెరుపొందాయి. ఈయన కామెడిషోలే కాకుండా బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించారు.