NationalNews

భారత రాష్ట్రపతుల ప్రస్థానం

Share with

భారత దేశానికి 15వ రాష్ట్రపతిగా ఘన విజయం సాధించిన తొలి గిరిజన మహిళ “ద్రౌపది ముర్ము” త్వరలో ఆ బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 18 న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నిర్వహించింది. 21న ఓట్ల లెక్కింపు జరిపింది. దీంట్లో ద్రౌపది ముర్ము తన ప్రత్యర్ది యశ్వంత్ సిన్హాపై భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు రాష్ట్రపతి గా దేశానికి సేవలందించిన మహోన్నత వ్యక్తుల గురించి ఒకసారి తెలుసుకుందాం.

DRAUPADI MURMU

స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతిగా “డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్” సేవలందించారు.ఈయన రెండు సార్లు రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. కాగా ,1950 జనవరి 26 న రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతిగా ఎన్నికైనట్టు రాజ్యాంగం ధృవీకరించింది. కేంద్ర ఎన్నికల సంఘం 1952 లో తొలిసారిగా నిర్వహించన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన పోటి చేశారు.

స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతిగా “డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్” సేవలందించారు.ఈయన రెండు సార్లు రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తిగా చరిత్రలో నిలిచారు.కాగా ,1950 జనవరి 26 న రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతిగా ఎన్నికైనట్టు రాజ్యాంగం ధృవీకరించింది.కేంద్ర ఎన్నికల సంఘం 1952 లో తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన పోటి చేశారు.

BABU RAJENDRA PRASAD

స్వతంత్ర భారత మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేసిన ప్రముఖ తత్వవేత్త “సర్వేపల్లి రాధాకృష్ణన్” 1962లో.. రెండో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.

SARVEPALLI RADHAKRISHNAN

“జాకీర్ హుస్సేన్” 1967లో మూడవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.దురదుష్టవశాత్తు పదవిలో ఉండగానే 1969 మే 3న ఆయన తుది శ్వాస విడిచారు.

ZAKIR HUSSAIN

జాకీర్ హుస్సేన్ మరణంతో 1969లో నిర్వహించిన ఎన్నికల్లో “వరాహాగిరి వేంకటగిరి” భారతదేశ నాలుగో ప్రధానిగా ఎన్నికయ్యి, రెండో ప్రాధాన్య ఓట్లలో గెలిచిన తొలి రాష్ట్రపతిగా చరిత్రకెక్కారు. ఫక్‌రుద్దీన్ అలీ అహ్మద్ భారత ఐదో రాష్ట్రపతిగా సేవలందించారు.పదవిలో ఉండగానే 1977లో ఫిబ్రవరి 11న కన్నుమూశారు.

FAKRUDDIN AHAMAD

అయితే 1977లో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యి “నీలం సంజీవ రెడ్డి” ఆ ఘనత సాధించారు.

NEELAM SANJEEVA REDDY

“జ్ఞానీ జైల్ సింగ్” 1982లో భారత 7 వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. దేశ ప్రథమ పౌరుడుగా ఎన్నికైన ఏకైక సిక్కుగా ఆయన ఖ్యాతిగాంచారు.

GNANI ZAIL SINGH

“ఆర్.వెంకట్రామన్” దేశానికి 8వ రాష్ట్రపతిగా సేవలందించారు.ఈయన హాయాంలోనే దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల శకం ఆరంభమయ్యింది.

R VENKATARAMAN

భారత దేశానికి ఉపరాష్ట్రపతిగా సేవలందించిన “శంకర్ దయాళ్ శర్మ” 1992 లో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.

SHANKARDAYAL SHARMA

దేశానికి తొలి దళిత రాష్ట్రపతి “కేఆర్ నారాయణ్” ,కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మొదటి ప్రెసిడెంటుగా గుర్తింపు పొందారు.ఉత్తర్ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు.1998 సార్వత్రిక ఎన్నికల్లో పదవిలో ఉండి ఓటు వేసిన మొదటి రాష్ట్రపతిగా ఖ్యాతికెక్కారు.

KR NARAYANAN

భారతదేశపు మిస్సైల్ మ్యాన్ ‌గా పేరుగాంచిన “ఏపీజే అబ్దుల్ కలాం” 11వ రాష్ట్రపతిగా విశేషమైన సేవలనందించారు. ప్రజల రాష్ట్రపతిగా మెలిగిన ఆయన రాష్ట్రపతి కార్యాలయాన్ని సామాన్యులకు చేరువ చేశారు.

APJ ABHUL KALAM

దేశానికి తొలి మహిళ రాష్ట్రపతిగా “ప్రతిభా పాటిల్” ఎన్నికయ్యి చరిత్ర సృష్టించారు. అయితే ఆమె అంతకు ముందు రాజస్థాన్ గవర్నర్‌గా పనిచేశారు. ఈమె తన పదవి కాలంలో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు.

PRATHIBHAPATIL

సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన “ప్రణబ్ ముఖర్జీ” దేశ 13వ రాష్ట్రపతిగా సేవలందించారు. దేశ అత్యున్నత పురస్కారం పొందిన 6 గురు రాష్ట్రపతులలో ఆయన ఒకరు. ఈయన హాయాంలోనే రాష్ట్రపతి భవన్ ట్విటర్ ఖాతా ప్రారంభమయ్యంది.

PRANAB MUKHERJI

భారత దేశానికి రెండవ దళిత రాష్ట్రపతి “రామ్‌నాథ్ కోవింద్” దేశ 14వ రాష్ట్రపతిగా సేవలందిస్తున్నారు.అయితే ఆయన పదవీకాలం ఈ నెల 24న ముగియనుంది.అంతకు ముందు ఆయన బీహార్ రాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు.

RAMANATH KOVIND