ద్రౌపది ముర్ము హిస్టరీ …
భారత ప్రథమ పౌరురాలిగా ద్రౌపది ముర్ము విజయం సాధించారు.15వ రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము గెలుపొందారు. రాజ్యాంగబద్ధ అత్యున్నత పదవికి ఎంపికైన తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది ముర్ము కొత్త చరిత్ర లిఖించారు. సంతాల్ తెగకు చెందిన ద్రౌపది ముర్ము భారత రెండో, తొలి గిరిజన మహిళాగా చరిత్రలో నిలిచిపోతారు. కాగా భారత ప్రథమ మహిళ ప్రతిభా సింగ్ పాటిల్ ఎంపికయ్యారు.
ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలోని బైదపోసి గ్రామంలో సంతాల్ ఆదివాసీ కుటుంబంలో 1958లో ముర్ము జన్మించారు. బైదపోసిలో ప్రాధమిక విద్యాభ్యాసం,రాయ్ రంగపూర్‌లో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు.1979లో భువనేశ్వర్ లోని రమాదేవి విమెన్స్ కాలేజీ నుంచి బీఏ పాస్ అయ్యారు. ఆ తర్వాత ఒడిశా ప్రభుత్వంలో క్లర్క్ గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. నీటిపారుదల, ఇంధన శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేశారు. తరువాతి కాలంలో తనకున్న ఆసక్తితో ఆమె టీచర్ అయ్యారు. రాయరంగ్ పూర్ లోని శ్రీ అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో గౌరవ ఉపాధ్యాయురాలిగా పని చేశారు.
ద్రౌపది ముర్ము 1997లో కౌన్సిలర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. తరువాత రాయరంగ్‌పూర్ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ (ఎన్‌ఏసీ) వైస్-ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైంది. 2000వ సంవత్సరంలో ఒడిషా అసెంబ్లీకి రాయరంగ్‌పూర్ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున పోటి చేసి గెలుపోందారు. 2004 లో మరోసారి రాయరంగ్‌పూర్ నుండి విజయం సాధించారు. ముర్ము, బిజూ జనతాదళ్ (బిజెడి), బీజేపీ మద్దతుతో ఏర్పాటు చేసిన నవీన్ పట్నాయక్ మంత్రి వర్గంలో కొన్నాళ్లు మంత్రిగా పనిచేశారు. రవాణా, వాణిజ్యం, మత్స్య పరిశ్రమ మరియు పశుసంవర్ధక మంత్రిత్వ శాఖలను నిర్వహించి విభిన్నమైన పరిపాలనా అనుభవాన్ని గడించారు.
.
2007లో ఒడిశా ఎమ్మెల్యేలకు ఇచ్చే నిల్‌కంఠ అవార్డు ద్రౌపది ముర్ము పొందారు. 2006 నుంచి 2009 వరకు ఒడిషా బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలుగా పనిచేశారు. 2013 లో ఆమె ఒడిశాలోని బీజేపీ పార్టీ షెడ్యూల్డ్ తెగ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుని స్థాయికి ఎదిగారు. 2015 లో జార్ఖండ్ 9వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి… 2021 వరకు గవర్నర్‌గా వ్యవహరించారు. మరణాంతరం కళ్లను రాంచిలో ఉన్న కశ్యప్ మెమోరియల్ ఐ ఆసుపత్రికి ఇవ్వాలని ప్రమాణపత్రంపై సంతకాలు చేశారు. 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఈ నెల 25న భారత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.