NewsTelangana

కాళేశ్వరం ప్రాజెక్టుపై సుప్రీం కోర్టులో పిటిషన్

Share with

కాళేశ్వరం ప్రాజెక్ట్ విస్తరణ పై దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. తెలంగాణ ప్రభుత్వంతోపాటు… కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ విస్తరణను వ్యతిరేకస్తూ చెరుకు శ్రీనివాస్ రెడ్డి సహా… భూనిర్వాసిత రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తదుపరి విచారణ ఈనెల 27వ కోర్టు వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సశ్యశ్యామలమవుతోందని టీఆర్ఎస్ చెబుతుంటే.. తాజాగా వచ్చిన వరదలు కాళేశ్వరం ప్రాజెక్టు మూలంగానేననంటూ విపక్షాలు విమర్శలుగుప్పిస్తున్నాయ్. భారీ వర్షాలతో పంప్ హౌస్‌లు నీట మునగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నాశిరకం ఉపకరణాలు వాడటం వల్ల ఈ దుస్థితి తలెత్తిందని ధ్వజమెత్తుతున్నాయ్. మరోవైపు ప్రాజెక్టు విస్తరణత తమ భవిష్యత్ ఏమవుతోందనన్న ఆందోళనలో రైతులున్నారు.