రాష్ట్రపతి ఎన్నిక షురూ ..
భారత దేశ రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ అధినేత, ప్రధాన కార్యనిర్వాహక అధికారి, దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. పోటీచేసే అభ్యర్థులు భారతీయ పౌరుడై ఉండాలి. 35 ఏళ్లు నిండి ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే ఎటువంటి సంస్థల్లో కూడా పదవిలో ఉండకూడదు. లోక్‌సభ సభ్యుడికి ఉండాల్సిన అర్హతలు ఉండాలి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ ఏడాది జూలై 24తో ముగియనుంది. ఈరోజు రాష్ట్రపతి ఎన్నిక జరగబోతోంది. జూలై 21 ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం, విపక్షాలు ఎన్నికల్లో గెలుపు కోసం యధాశక్తి ప్రయత్నిస్తున్నాయి. పోటీలో ఎన్డీఏ పక్షాల అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ విధానం లో ఉదయం 10 గం.ల నుంచి సాయంత్రం 5 గం.ల వరకు పార్లమెంట్ మరియు రాష్ట్రాల అసెంబ్లీలలో ఓటింగ్ జరగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో 4809 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 776 మంది ఎంపీలు, 4033 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు ఓటు హక్కు ఉన్న ఎలక్ట్రోరల్ కాలేజ్ మెంబర్స్ మాత్రమే ఓటు వేస్తారు. ఎంపీలు ఎమ్మెల్యేలు లకు మాత్రమే ఓటు హక్కు ఉంది. ఎమ్మెల్యే , నామినేటెడ్ సభ్యులకు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండదు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఈసీ ఇచ్చిన పెన్ను ద్వారా మాత్రమే సభ్యులు ఓటింగ్ లో పాల్గొనాలి. ఎంపీలకు ఆకుపచ్చ, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. పార్లమెంట్‌లో రూమ్ 63లో రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. క్యూలైన్లలో నిలబడి ఎంపీలు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎంపీలు,ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ అభ్యర్ధి ముర్ముకు వైసీపీ – టీడీపీ సభ్యులు మద్దతు ప్రకటించాయి. సభలోని మొత్తం 175 మంది సభ్యుల్లో వైసీపీకి 151, టీడీపీకి 23 మంది ఉన్నారు. ఒక ఓటు జనసేనకు ఉంది. ఆ ఓటు కూడా ముర్ముకు మద్దతుగా ఉండే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో ఏకపక్షంగా ఒకే అభ్యర్ధి వైపు మొగ్గు చూపటం ఖాయంగా కనిపిస్తోంది. సీఎం జగన్ మొదటి ఓటు వేశారు. చాలా రోజుల తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి ఓటు వేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలతో పాటుగా ఎమ్మెల్యేలకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఇక తెలంగాణాలో అసెంబ్లీలో మొదటి ఓటు కేటీఆర్ వినియోగించుకున్నారు. టీఆర్‌ఎస్ సర్కార్ విపక్షాల అభ్యర్ది యశ్వంత్ సిన్హాకు మద్దతునిచ్చిన సంగతి మనకు తెలిసిందే.