NewsTelangana

క్లౌడ్ బరస్ట్ …కావాలనే విదేశాలు కుట్ర చేస్తున్నాయి-కేసీఆర్

Share with

భద్రాచలంలో గోదావరి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ చరిత్రలో కనీవినీ ఎరుగని వరదను కడెం ప్రాజెక్టు వద్ద చూశాం. ఏ ఒక్కరోజూ అది 2.50 లక్షల క్యూసెక్కులు దాటలేదన్నారు. హయ్యెస్ట్ డిశ్చార్జి సుమారు 3 లక్షలు క్యూసెక్కులని చెప్పారు. ఈసారి 5 లక్షలు దాటిపోయిందని… మానవ ప్రయత్నం కాదు, భగవంతుని దయతోనే అది బతికిందన్నారు. ఆ ఫొటోలు, వీడియో చూస్తుంటే.. మొత్తం అంతా నీళ్లు ఉండి.. మీద ఒక గీతలాగా డ్యామ్ కనబడుతోంది. గీత గీసినట్టే..ఇలా అకస్మాత్తుగా వచ్చే భారీ వరదలకు క్లౌడ్ బరస్ట్ కారణం ఇతర దేశాల వాళ్లు కావాలనే మన దేశంలో క్లౌడ్ బరస్ట్ సృష్టిస్తున్నాన్నట్లు తనకు తెలిసిందన్నారు సీఎం కేసీఆర్. గతంలో లద్దాఖ్‌లోని లేహ్, ఉత్తరాఖండ్‌లో ఇలాగే చేశారని ఈ మధ్య గోదావరి పరివాహక ప్రాంతంపై కూడ కుట్ర చేసినట్లు సమాచారం వచ్చిందన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపాయ్.

ఇప్పడు ఇది రాజాకీయ వర్గల్లో చర్చనీయాంశంగా మారింది

మేఘలపై సోడియం అయొడైడ్ చల్లడం ద్వారా సులభంగా వర్షం పడుతుంది. గంటకు 100-120 మి.మీ ల కంటే ఎక్కువ వర్షపాతం 1-10 KMల పరిధిలో నమోదైతే క్లౌడ్ బస్టర్ అంటారని నిపుణులు చెబుతున్నారు. ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు క్లౌడ్ బరస్ట్ సంభవిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 2013లో ఉత్తరాఖండ్‌లో జరిగినట్లుగా భారీ ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. అయితే, కుంభవృష్టి కురిసిన ప్రతిసారీ క్లౌడ్ బరస్ట్ అని చెప్పలేం.


క్లౌడ్ బరస్ట్‌కు కారణాలేంటి?
ఇది భౌగోళిక, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. రుతుపవనాలు దక్షిణాన అరేబియా సముద్రం నుంచి కొంత తేమను తీసుకువస్తాయి. వెస్ట్రన్ డిస్టబేన్స్ కారణంగా మధ్యధరా తీరం నుంచి వీస్తున్న గాలులు పశ్చిమాన ఇరాన్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ నుంచి తేమను తోడ్కొని వస్తాయి. ఈ రెండూ ఢీకొన్నప్పుడు ఏర్పడిన మేఘాలు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. ఇవి అకస్మాత్తుగా తక్కువ సమయంలో భారీగా వర్షిస్తాయి. పర్వతాలపై తరచూ ఇలాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంటాయి. కొండలపై ఏర్పడిన మేఘాలు అధిక తేమను కలిగి తక్కువ సమయంలో కుంభవృష్టి కురిపిస్తాయి. ఆ కారణంగా పర్వతాలపై క్లౌడ్ బరస్ట్ సంఘటనలు అధికంగా జరుగుతుంటాయి.

క్లౌడ్ బరస్ట్‌ను ముందే అంచనా వేయొచ్చా?
1-10 కి.మీలోపు ఉన్న ప్రాంతాల్లో వాతావరణ మార్పుల కారణంగా తేమతో నిండిన భారీ మేఘాలు మోహరించడం వలన క్లౌడ్ బరస్ట్ జరుగుతుంది. అందువల్ల వీటిని అంచనా వేయడం కష్టం.రాడార్ సహాయంతో పెద్ద ప్రాంతంలో కురవబోయే భారీ వర్షాలను వాతావరణ శాఖ అంచనా వేయగలదు. కానీ ఏ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరగవచ్చు అనేది అంచనా వేయడం దాదాపు అసాధ్యం. సాధారణంగా ఋతుపవనాలు వచ్చేముందు, వచ్చిన తరువాత కూడా క్లౌడ్ బస్టర్ జరుగుతుంటుంది. మే నుంచి జూలై-ఆగష్టు వరకు భారతదేశంలో ఉత్తర ప్రాంతలలో ఇలాంటి వాతావరణ పరిస్ధితులు కనిపిస్తుంటాయి.

కేసీఆర్ చెప్పిన్నట్టు జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ ప్రాంతాల్లో ‌క్లౌడ్ బరస్ట్ జరిగిందా?
చిరపుంజీలాంటి ప్రాంతాల్లో ఏడాది పొడుగునా వర్షాలు కురుస్తుంటాయి. బెంగాల్ తీరం నుంచి అధిక తేమతో కూడిన గాలులు వీస్తుంటాయి. కాబట్టి వర్షాకాలంలో క్లౌడ్ బరస్ట్ సంభవమే. అక్కడ చాలాసార్లు మేఘాల విస్ఫోటనం జరిగింది. కానీ అక్కడి ప్రజలు ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందు నుంచి సిద్ధంగా ఉంటారు. అందుచేత అక్కడ క్లౌడ్ బరస్ట్ అయినా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించడం అరుదు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, కేవలం ఒక్క గంటలో100 మి.మీల వర్షం కురవడం వలనే నష్టం వాటిల్లదు. సమీపంలో నది లేదా సరస్సు ఉంటే, కుంభవృష్టి వలన వాటిల్లో నీరు పొంగి, వరదలు ముంచెత్తడం వలన చుట్టుపక్కల నివాస ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.ఈ కారణంగానే జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ ప్రాంతాల్లో ‌సంభవించిన క్లౌడ్ బరస్ట్ సంఘటనల్లో అధిక ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగిన వార్తలు ఎక్కువగా వినిపిస్తుంటాయి.

కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ప్రతిపక్షాలు

క్లౌడ్ బస్టర్ వల్లే వర్షలు భారీగా కురిశాయని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉత్తమ్ కూమార్ రెడ్డి మండిపడ్డారు.అంతర్జాతీయ కుట్రతో వరదలు వచ్చాయనడంలో అర్ధం లేదు.రాష్ట్ర ముఖ్యమంత్రే ఇలా మాట్లడటం సరికాదు.ప్రజల దృష్టి మళ్లించడానికి కేసీఆర్ చుశారు అందుకే ఇలాంటి వ్యాఖ్యలు అని ఆరోపించారు.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ విషయంపై కేంద్రం వేంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న లోపాలు, అవినితిని పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగానే, క్లౌడ్ బరస్ట్ అంశాన్ని తెరపై తెచ్చారని ఆక్షేపించారు. భారీ వర్షాల వేనుక విదేశీ కుట్ర ఉందనడం శతబ్దపు జోక్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు