NationalNews

నిరసనలతో అట్టుడుకుతున్న పార్లమెంటు ఉభయసభలు

Share with

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయినప్పటి నుంచి ఉభయ సభల్లో నిరసనలు వెళ్లువెత్తుతూనే ఉన్నాయ్. ఉభయ సభలు వరుస  వాయిదా తీర్మానాలతో మార్మోగుతున్నాయి. అయితే దేశంలో ధరల పెరుగుదల… కొన్ని రకాల వస్తువులపై జీఎస్టీ అమలు, అగ్నిపథ్ పథకం  వంటి అంశాలపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాల  నిరసనలతో పార్లమెంటు దద్దరిల్లుతోం ది. దీంతో పార్లమెంటు ఉభయ సభలు నేటికి వాయిదా పడ్డాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ సమావేశమవగానే కాంగ్రెస్,టీఎంసీ ,డీఎంకే తదితర పార్టీల సభ్యులు జీఎస్టీకీ వ్యతిరేకంగా  పోడియం వద్దకు  దూసుకువచ్చారు. ప్యాక్ చేసిన పెరుగు, పప్పుదినుసులు, తృణధాన్యాలు ,పిండి తదితరాలపై కొత్తగా 5%  జీఎస్టీ … వస్తువులు,సేవల పన్నుని కేంద్రం తీసుకురావడంపై ఆందోళనకు దిగారు. దీంతో “గబ్బర్ సింగ్ స్ట్రైక్ అగైన్” అని రాసి ఉన్న ప్లకార్డులను ఎంపీలు ప్రదర్శించారు. సీట్లో వెళ్ళి కూర్చోవాలని స్పీకర్ ఓం బిర్లా సూచించినా ఎంపీలు వెనక్కి తగ్గలేదు. ప్లకార్డులు తీసుకురావడం నిబంధనలకు విరుద్ధమని… అంటూ స్పీకర్ వారిస్తున్నా… వారు మాత్రం వెనక్కి తగ్గలేదు.

రైతుల అంశాన్ని సభ బయట లేవనెత్తుతున్నారని.. కానీ సభ లోపల జరిగే చర్చలో పాల్గొనడం లేదని స్పీకర్ విమర్శించారు. గత సమావేశాల్లో ధరల పెరుగుదలపై జరిపిన చర్చల్లోనూ పాల్గొనలేదన్నారు. ఇది సరికాదని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రతిపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్యహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. అయితే సభ ప్రారంభమైన పావుగంటకే వాయిదా పడింది. మరల తిరిగి సభ ప్రారంభమైనప్పుడూ ప్లకార్డులతో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పోడియం వద్దకు దూసుకువచ్చాయి. దీంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న కిరిటి ప్రేమ్‌జీబాయ్ సోలంకి సభను బుధవారానికి వాయిదా వేశారు.ఇటువంటి నేపథ్యంలో ఈ రోజు సభ ఎలా జరుగుతుందని అంతటా ఆసక్తి నెలకొంది.