సీఎం జగన్‌ను కలిసిన.. ఫ్యూచర్ పైలెట్ జాహ్నవి
పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జాహ్నవి నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి వరద బాధితులను పరామర్శించేందుకు రాజమహేంద్రవరం ఆర్అండ్‌బి గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరారు.ఈ నేపథ్యంలో జాహ్నవి ముఖ్యమంత్రిని కలిశారు.తనకు పైలెట్ ఆస్ట్రొనాట్ అవ్వాలని ఉందని… తన కోరికను సీఎంకు వివరించారు.

తన కలను సాకారం చేసుకోవడానికి అవసరమైన శిక్షణకు అయ్యే ఖర్చును ప్రభుత్వం అందజేయాలని జాహ్నవి సీఎంకు విజ్ఙప్తి చేశారు. భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌లా అంతరిక్షంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నాని తెలిపారు. గట్టి సంకల్పంతో ముందుకెళుతున్నట్లు సీఎంకు జాహ్నవి వివరించారు. జాహ్నవి విజ్ఙప్తి విన్న.. సీఎం జగన్ సాలుకూలంగా స్పందించారు.