NewsTelangana

లోన్ యాప్స్ వేధింపులు తాలలేక  సూసైడ్..

Share with

లోన్ యాప్స్ వేదింపులు భరించలేక ఫైర్ మెన్ సుధాకర్ రాజేంద్రనగర్ ‌లోని శాస్రీపురంలో రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు. గోల్డెన్ రూపీ యాప్‌లో ఆరు వేల రుణం తీసుకున్న పాపానికి బలికావాల్సి వచ్చింది. గత కొంత కాలంగా గోల్డెన్ రూపీ లోన్ ఎజెంట్లు… తీసుకున్న లోన్ చెల్లించాలని వేధింపులకు గురిచేస్తూ వచ్చారు లోన్ కట్టకపోతే భార్య అశ్లీల ఫోటోలు పోర్న్ యాప్‌లో పెడతామని అవమానించడంతో సుధాకర్ చాలా ఆవేదనకు గురయ్యారు. అంతే కాకుండా తన బంధువులకు , స్నేహితులకు అసభ్యంగా మెసెజ్‌లు పెడుతూ తనను మానసికంగా హింసించడంతో తల్లడిల్లిపోయాడు. చివరి సారిగా  అన్నకు ఫోన్ చేసి తాను చనిపోతున్నట్టు   చెప్పినా… కొద్ది సమయానికే రైల్వే ట్రాక్ పై శవమై కనిపించాడు. లోన్ యాప్స్ ఉన్నంత వరకు ఇలాంటి హత్యలు జరుగుతూనే ఉంటాయని , వీరికి తక్షణమే కఠిన శిక్ష విధించాలని సుధాకర్ బంధువులు డిమాండ్ చేస్తున్నారు.