NewsTelangana

అప్పులతో అవినీతి పేరుకుపోతోందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

Share with

కేసీఆర్ సర్కారు తెలంగాణ ప్రజల నెత్తిన అప్పుల పేర్చుకుంటూ పోతోందంటూ విమర్శించారు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రోజు రోజుకు అప్పులు పెంచేసుకుంటూ పోతున్నారని దుయ్యబట్టారు. 2014 లో తెలంగాణ రుణం 69 వేల రూపాయలుగా… 2014 లో తలసరి రుణం 18 నుంచి 19 వేల రూపాయలు. అయితే ప్రస్తుతం 2022 లో తలసరి అప్పు లక్ష రూపాయలకు చేరిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ సర్కారు తెలంగాణను అప్పుల ఊబిలో నెడుతోందని ఆక్షేపించారు. ప్రతి ఏడాది పెద్ద ఎత్తున చేస్తున్న రుణాలతో తెలంగాణలో జరుగుతున్న నిర్మాణాత్మకమైన అభివృద్ధి ఏమీ లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్‌లను ఏర్పాటు చేసి తద్వారా పెద్ద ఎత్తున అధిక వడ్డీలకు అప్పులు తెస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం నేరుగా చేసే అప్పులే కాకుండా, కార్పొరేషన్ల ద్వారా చేసే అప్పులు వల్ల రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి రావాడనికి కారణం కేసీఆర్ సర్కారు అవినీతి, అసమర్థత కారణమన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.