Andhra PradeshHome Page Slider

సీఎం కోసం విశాఖలో ఇళ్లు కోసం అధికారుల అన్వేషణ

ఇకపై తాను కూడా కొత్త రాజధాని విశాఖలో ఉంటానంటూ ఇటీవల ఢిల్లీలో ప్రకటించిన ఏపీ సీఎం జగన్.. అందుకు తగిన విధంగా అడుగులు వేస్తున్నారు. జగన్ విశాఖలో ఉండేందుకు తగిన నివాసం కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎంతోపాటు, ముఖ్య అధికారులు, పేషీలను సైతం విశాఖకు మార్చేందుకు తగిన కార్యాలయాల వేట మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. సీఎం జగన్ వచ్చే నెలలో విశాఖ నివాసంలో గృహ ప్రవేశం చేసేందుకు తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. బీచ్ రోడ్‌లో సీఎం కోసం అధికారులు తగిన నివాసాన్ని వెదికే పనిలో ఉన్నారు. ఇటీవల ఎంవీపీ న్యాయ విద్యా పరిషత్తు పక్క నుంచి రహదారి విస్తరణ పనులు చేయడంతో ముఖ్యమంత్రి ఇటువైపు ఉండొచ్చని భావిస్తున్నారు.