సీఎం జగన్ హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే
వరద ప్రభావిత ప్రాంతాలైన పోలవరం ప్రాజెక్టు , ధవళేశ్వరం బ్యారెజ్, లంక గ్రామలను సీఎం జగన్ హెలికాఫ్టర్ నుండి పరిశీలించారు. వరద ప్రభావానికి గురై, రాకపోకలు స్థంభించిన ప్రాంతాలలో వెంటనే సహాయక చర్యలు అందించాలన్నారు. ఇంకా వరద ముప్పు ఉన్న గ్రామాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలన్నారు. ఓ వైపు గోదావరిలో వరద ఉధృతి తీవ్రంగా పెరుగుతోంది.
మరో వైపు భద్రాచలం వద్ద నీటి మట్టం 70.10 అడుగులకు చేరింది. ఈ నీటి మట్టం మరో 21 గంటల్లో ధవళేశ్వరం బ్యారెజ్‌కి చేరుతుందని స్టేట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ తెలియపరిచింది. వీటన్నింటిని స్వయంగా పర్యవేక్షించిన సీఎం జగన్ వేంటనే తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.