రామాయపట్నం పోర్ట్‌కు జగన్ శంకుస్థాపన
ఏపీ సీఎం జగన్ మరో హామీ నెరవేర్చనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్ట్‌ను నిర్మిస్తానని నాడు ప్రజలకు భరోసా ఇచ్చారు. నేడు జగన్ ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీఎం జగన్ ఇవాళ రామాయపట్నం పోర్టుకు భూమి పూజ చేశారు. ముందుగా డ్రెడ్జింగ్ జరిగే చోట సముద్రుడికి పూజలు నిర్వహించి… పట్టు వస్త్రాలను సమర్పించి పోర్ట్ పనులను ప్రారంభించారు. అనంతరం పోర్ట్ నిర్వాసితులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఆ తరువాత 12:30 నుండి సీఎం పోర్ట్ నిర్వాసితులు,రైతులను ఉద్దేశ్యించి మాట్లాడారు. పోర్ట్ నిర్మాణంతో రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ పోర్ట్‌ను నిర్మించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. స్థానికులకే 75% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. అదే విధంగా ఈ పోర్ట్ నిర్మాణంతో ఆర్ధిక ప్రగతి పెరుగుతుందన్నారు. ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు తగ్గుతుందన్నారు.అయితే ఈ పోర్టు నిర్మాణం రెండు దశలలో జరుగుతుందని… మొదటి దశలో మొత్తం రూ. 3736 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభిస్తామన్నారు. పోర్ట్ నిర్మాణంతో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోయాన్నారు జగన్.