ఉపరాష్ట్రపతి విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వా
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మార్గరెట్ అల్వా ఉపరాష్ట్రపతిగా రేసులో దిగారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆమెను ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించారు. 17 పార్టీలు అల్వా అభ్యర్థిత్వాన్ని ఆమోదించారన్నారు పవార్. అల్వా 5 సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, గవర్నర్ గా పలు రాష్ట్రాల్లో పనిచేశారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తనను ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు మార్గరెట్ అల్వా. తన అభ్యర్థిత్వంపై విశ్వాసం ఉన్న పార్టీలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6న జరగనుంది. రాష్ట్రపతి ఎన్నిక ఈనెల 18న జరగనుంది. మార్గరెట్ అల్వా కర్నాటకలోని మంగళూరులో 1942 ఏప్రిల్ 14న జన్మించారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో కీలక పదవులను ఆమె అనుభవించారు. ఉపరాష్ట్రపతి రేసులో ఉన్న జగదీప్ ధన్కడ్ తరహాలోనే అల్వా సైతం న్యాయవాదిగా వ్యవహరించారు.