Andhra PradeshNews

హోం మంత్రి అమిత్ షా వర్చ్యువల్ భేటీలో జగన్

Share with

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా ‘‘హర్‌ ఘర్‌ తిరంగా’’ కార్యక్రమంపై… పలు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు అమిత్ షా. దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించేలా పలు కార్యక్రమాలు రూపకల్పన చేయాలన్నారు. ఆగష్టు 13 నుంచి 15 వరకు హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో… 1.62 కోట్ల జాతీయ పతాకాల ఆవిష్కరణ జరగనుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్న సందర్భంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం ద్వారా పౌరుల్లో దేశభక్తి భావనను పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు వైఎస్ జగన్. కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. పత్రికల్లో ప్రకటనలు, హోర్డింగ్స్, పలు గీతాలు రూపొందించామన్నారు.