NationalNews

కాసేపట్లో రాష్ట్రపతి ఎన్నిక ప్రారంభం

Share with

దేశ ప్రధమ పౌరుడు… భారత 15వ రాష్ట్రపతి ఎన్నిక కాసేపట్లో రాష్ట్రపతి ఎన్నిక ప్రారంభం. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలిచేందుకు కావాల్సిన ఓట్లను పొందడం ఖాయంగా కన్పిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే రాష్ట్రపతి ఎన్నిక లాంచనమని చెప్పుకోవాలి. సోమవారం పార్లమెంట్లోనూ, రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ ఎన్నిక జరగనుంది. ఎలక్టోరల్ కాలేజీలో 776 మంది ఎంపీలతోపాటు.. దేశంలోని రాష్ట్రాల్లో 4033 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు 60 శాతానికి పైగా ఓట్లు వచ్చేలా పరిస్థితులు కన్పిస్తున్నాయ్. ఇప్పటికే ఎన్డీఏ పక్షాలు కాకుండా…ముర్ముకు వైసీపీ, బీజేడీ, శివసేన, జార్ఖండ్ ముక్తి మోర్చా మద్దతు చెప్పడంతో ఎన్డీఏ అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే అనుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక ఈసారి కొంచెం భిన్నంగా జరగనుంది. ఏపీలో ఓట్లన్నీ గంపగుత్తగా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు, పడనుండగా… తెలంగాణలో మాత్రం బీజేపీ తప్ప… మిగతా ఓట్లన్నీ విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు పడే అవకాశం ఉంది.