వాణిజ్య గ్యాస్ ధరల పెరుగుదల
మే 1 నుంచి 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను సగటున రూ. 993 మేర పెంచుతూ చమురు సంస్థలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. గృహ అవసరాల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేకపోవడం ఒక్కటే సామాన్యులకు ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం 19 కేజీల సిలిండర్ ధర హైదరాబాద్లో రూ. 3,315, ఢిల్లీలో రూ. 3,071, 5 కిలోల సిలిండర్ ధర రూ. 914.50గా ఉంది.
చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో అంతరాయాలు ఏర్పడటం వల్ల రవాణా ఖర్చులు పెరిగాయి. ఫిబ్రవరిలో యుద్ధం మొదలైనప్పటి నుండి ఇది మూడవ పెంపు. మార్చిలో రూ. 144, ఏప్రిల్లో రూ. 195 పెరగగా.. ఇప్పుడు ఏకంగా రూ. 993 పెరగడం గమనార్హం.
వాణిజ్య గ్యాస్ ధర రూ. 3 వేల మార్కును దాటడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఇది పరోక్షంగా ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ల సేవలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

