Home Page SliderInternationalLifestyleNewsPoliticsviral

ఝుమ్కాలు ధరించిన ఇటలీ ప్రధాని

ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని రాజకీయ వేదికలపైనే కాకుండా, సోషల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆమె ఎక్స్ వేదికగా పంచుకున్న ఒక ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. సాధారణంగా పాశ్చాత్య దుస్తుల్లో కనిపించే మెలోని, ఈసారి భారతీయ సంప్రదాయ శైలిని తలపించేలా భారీ ‘ఝుమ్కాలు’ (చెవిపోగులు) ధరించి కనిపించడంతో భారతీయ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ “ఝుమ్కా మూమెంట్” రాజకీయ చర్చలను పక్కకు నెట్టి, ఫ్యాషన్ , జియోపాలిటిక్స్‌ను ఒకే చోటికి చేర్చింది.

తన పోస్ట్‌లో మెలోని కేవలం ఫ్యాషన్ గురించే కాకుండా, ఇటలీ సార్వభౌమాధికారం ,స్వతంత్ర విదేశాంగ విధానంపై గంభీరమైన వ్యాఖ్యలు చేశారు. “మేము ఎవరి ప్రభావానికీ లోబడి లేము, మాకు యజమానులు లేరు. ఇటలీ ప్రయోజనాలే మా ఏకైక మార్గదర్శక సూత్రం” అంటూ స్పష్టం చేశారు. ఆమె రాసిన శక్తివంతమైన క్యాప్షన్ కంటే, ఆ ఫోటోలో ఆమె ధరించిన పొడవాటి చెవిపోగులే భారతీయులను ఎక్కువగా ఆకట్టుకున్నాయి. కేవలం కొన్ని గంటల్లోనే ఈ ఫోటో వైరల్ కావడంతో, నెటిజన్లు బాలీవుడ్ పాపులర్ సాంగ్ “వాట్ ఝుమ్కా?” అంటూ మీమ్స్‌తో సందడి చేస్తున్నారు.