Home Page SliderNationalPolitics

ఢిల్లీ ప్రభుత్వానికి దాని వల్ల రూ. 2 వేల కోట్ల నష్టం

Share with

‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)’ రూపొందించిన నివేదికలో ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ పాలసీ కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల నష్టం వాటిల్లిందని ఈ నివేదికలో తేలింది. ఢిల్లీ మద్యం పాలసీ విషయంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం విఫలమయ్యిందని కాగ్ పేర్కొంది. అప్పటి డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా మంత్రుల బృందం విస్మరించిందని ఆరోపించింది. ఈ పాలసీ విషయంలో గవర్నర్ ఆమోదం కూడా లేదని, లైసెన్సుల జారీ నిబంధనలు కూడా ఉల్లంఘించినట్లు తెలిపింది. 2021 నవంబర్‌లో ప్రవేశపెట్టిన మద్యం పాలసీలో పలు అవకతవకలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో 2022 సెప్టెంబర్‌లో దానిని రద్దు చేశారు. ఈ కుంభకోణంలో మనీశ్ సిసోదియా, కేజ్రీవాల్,  కొందరు ఆప్ నేతలు, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత అరెస్టయ్యారు. కొన్ని నెలల అనంతరం విడుదలయ్యారు. ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాగ్ నివేదికలో ఈ అంశాలు బయటపడడంతో బీజేపీ కుట్రపూరితంగా ఇలా ప్రచారం చేస్తోందంటూ ఆప్ నేతలు మండిపడుతున్నారు.