అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్
హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు నుండి బిగ్ రిలీఫ్ లభించింది. అల్లు అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విదేశాలకు వెళ్లిన కాలంలో ఆదివారం పోలీసు స్టేషన్‌లో హాజరు కావాలన్న నిబంధనను సడలించారు. పుష్ప-2 ప్రీమియర్ షో తొక్కిసలాట కేసులో వచ్చిన రెగ్యులర్ బెయిల్ షరతుల్లో భాగంగా అల్లు అర్జున్ ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలన్న నిబంధన తెలిసిందే.