అడగకపోయినా….
త్వరలో రాష్ట్రపతి ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఏ అభ్యర్థికి మద్దతు తెలుపుతుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సోమవారం తెలుగుదేశం పార్టీ ఎట్టకేలకు ఒక నిర్ణయానికి వచ్చింది. పార్టీ వ్యూహ కమిటీతో చర్చించిన అనంతరం చంద్రబాబు ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో కూడా కే ఆర్ నారాయణ, ఏపీజే అబ్దుల్ కలాం కు తెలుగుదేశం పార్టీ మద్దతు పలికింది. అలానే ఆదివాసి మహిళకు మద్దతు తెలపాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. సామాజిక న్యాయం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందు వరసలో ఉంటుందని ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ అభ్యర్థి ముర్ముకు మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ స్పష్టం చేసింది.