నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. భారత దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలపనున్నారు. రెండు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలో బస చేస్తారు. జాతీయ రాజకీయాలపై కొందరు కీలక నేతలను కలిసే చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. సీఎం కేసీఆర్ వెంట కొందరు మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు కాకుండా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన ద్రౌపది ముర్మును కలవడం ఆసక్తిగా మారింది.