Telangana

భద్రాద్రి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు,అధికారులు,పోలీసులు ఎన్ని రకాలుగా చర్యలు చేపడుతున్నప్పటికీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను మాత్రం అరికట్టలేకపోతున్నారు. అధికారులు,ప్రభుత్వాల కళ్లుగప్పి కేటుగాళ్లు మాదక ద్రవ్యాలను ఇతర రాష్ట్రాలకు,దేశాలకు అక్రమంగా తరలిస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా సారపాకలో పోలీసుల తనిఖీల్లో లక్షల విలువైన గంజాయి బయటపడింది.మొత్తం 196 కేజీల గంజాయిని పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. అయితే దీని విలువ రూ.34 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా దీనిని నిందితులు అరకు నుంచి నాందేడ్ తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ నిమిత్తం జైలుకు తరలించారు. ఇది ఇలా ఉంటే గంజాయికి బానిసలై  పలువురు అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు తరచూ తెలుగు రాష్ట్రాలలో వెలుగు చూస్తూనే ఉన్నాయి.