Breaking NewsHome Page Sliderhome page sliderInternational

హాదీ హంతకులు భారత్ లో..!

ఇంక్విలాబ్‌ మంచ్‌ నాయకుడు, విద్యార్థి నేత షరీఫ్‌ ఉస్మాన్‌ హదీ హత్య కేసులో నిందితులు భారత్ లో ఉన్నట్లు ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు ఆరోపించారు. ప్రధాన అనుమానితులుగా ఉన్న ఫైసల్ కరీం మసూద్, ఆలంగీర్ షేక్‌లు మేఘాలయ సరిహద్దు గుండా భారత్‌కు పారిపోయారని వెల్లడించారు. అనుమానితులు భారత్ లోకి ప్రవేశించిన వెంటనే ‘పూర్తి’ అనే వ్యక్తిని కలిశారని, తర్వాత సామి అనే ట్యాక్సీ డ్రైవర్ మేఘాలయలోని తురా సీటీకి తీసుకెళ్లినట్లు ఆదనపు కమిషనర్ ఎస్ఎన్ నజ్రుల్ ఇస్లాం స్పష్టం చేశారు. నిందితులు సాయం చేసిన ఇద్దరు వ్యక్తులను భారత పోలీసులు అరెస్ట్ చేసినట్లు తమకు సమాచారం అందిందని ఆయన అన్నారు. బంగ్లాదేశ్‌ నుంచి పారిపోయిన ఇద్దరిని తమకు అప్పగించే విషయంలో భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని నజ్లుల్ పేర్కొన్నారు. భారత్ అధికారులు ఈ విషయంపై స్పందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

గతేడాది విద్యార్థి ఉద్యమంతో షేక్ హసీనా ప్రభుత్వం వైదోలగడంలో ముఖ్య పాత్ర పోషించిన విద్యార్ధి నేత షరీఫ్‌ ఉస్మాన్‌ బిన్‌ హాదీ హత్యతో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అతడి హత్య కేసుపై దర్యాప్తు చేపట్టిన బంగ్లాదేశ్‌ పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు.