యుద్ధానికి ముగింపు పలికే ఆలోచనే పుతిన్‌కు లేదు: ఉక్రెయిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్ తెచ్చిన సంధి ప్రతిపాదనపై ఉక్రెయిన్ స్పందించింది. అసలు ఆయనకు యుద్ధానికి ముగింపు పలికే ఉద్దేశమే లేదని మండిపడింది. రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకకావడంతో కుట్రకు తెరతీశారని ఎద్దేవా చేశారు. ఆయన డిమాండ్లలో కొత్తవేమీ లేవని పేర్కొంది. కాగా నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరకూడదని, తాము స్వాధీనం చేసుకున్న నాలుగు ప్రాంతాల్లోని ఉక్రెయిన్ బలగాలు వెళ్లిపోవాలని పుతిన్ డిమాండ్ చేశారు.