Home Page SliderTelangana

ఎట్టకేలకు బరువు తగ్గే మెడిసిన్‌కు భారత్‌లో ఆమోదం

భారత్‌లోని ఎపెక్స్ డ్రగ్ రెగ్యులేటర్ ఎట్టకేలకు బరువును తగ్గే మందులను ఆమోదించింది. ఎలి లిల్లీస్ టైర్జేపటైడ్ అనే మందును భారత్‌ అంగీకరించింది. దీనిని టైప్ 2 మధుమేహ వ్యాధికి మందుగా వాడతారు. దీనితో పాటు ఇది బరువు తగ్గేందుకు సమర్థవంతంగా పనిచేస్తుంది. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(CDSCO) దీనికి పచ్చజెండా ఊపింది. దీనిలో మౌంజారో, జెప్‌బౌండ్ అనే కాంబినేషన్ మెడిసిన్ ఉంటుంది. గత ఏడాది ఈ మందులు పెద్దలలో ఒబేసిటీ తగ్గించడానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం పొందాయి. మౌంజారో డయాబెటిస్‌కు, జెప్‌బౌండ్ బరువు తగ్గడానికి పని చేస్తుంది.

కానీ భారత్‌లో టైర్జేపటైడ్‌ను కేవలం డయాబెటిస్ వ్యాధికి సంబంధించిన మందుగానే ఆమోదించారు. ఇది ఎలా పనిచేస్తుందంటే కడుపు ఖాళీ అవడాన్ని నిరోధిస్తుంది. భోజనం అనంతరం గ్లూకోజ్ రక్తంలో కలిసే సమయాన్ని తక్కువ చేస్తుంది. దీనితో పోస్ట్‌ప్రానడెన్షియల్ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. దీనితో ఆకలి వేసే సమయం తగ్గి, ఆహారం తీసుకునే సమయాన్ని పెంచుకుంది. దీని ఫలితంగా బరువు అదుపులోకి వస్తుంది. అయితే కొన్ని సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటాయంటూ హెచ్చరిస్తున్నారు వైద్యులు. డయేరియా, అలసట, వాంతులు, మలబద్దకం, జీర్ణం కాకపోవడం, కడుపు నొప్పి వంటి లక్షణాలు సాధారణంగా రావచ్చు. క్లోమ గ్రంధి పెరగడం, బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిపోవడం, సీరియస్ అలెర్జీలు, గాల్ బ్లేడర్ సమస్యలు, కంటిచూపులో తేడాలు వంటి ప్రమాదకర లక్షణాలు ఉంటే మాత్రం ఈ మందును వాడకూడదని పేర్కొన్నారు.