NationalNews

మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తి ఎలా – నివారణ ఎలా?

Share with

మంకీపాక్స్ వ్యాధి ప్రపంచంలో అతివేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచ ఆరోగ్యసంస్ధ అంచనా ప్రకారం 50 దేశాలకు ఈవ్యాధి విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా 3,413 కేసులు నమోదు అయ్యాయి. ఈవ్యాధి జంతువుల నుండి వ్యాప్తి చెందే వైరస్ కు సంబందించిన వ్యాధి.  ఈవ్యాధిని గుర్తించడమెలా, దీనిని అరికట్టడమెలా అనే విషయంలో కేంద్రప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. శరీరంపై దద్దుర్లు, జ్వరం, తలనెప్పి, వాపు, చలి, గొంతునొప్పి, దగ్గు మొదలైనవి ఈవ్యాధి లక్షణాలు. ఈవ్యాధి సోకిన వారికి దగ్గరగా తిరగడం వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. వారిని తాకడం, వారికి దగ్గులు,తుమ్ములు,వచ్చినప్పుడు సమీపంలో గాలి పీల్చడం, చెమట,కన్నీళ్లు, లైంగిక సంపర్కం, రోగులు వాడిన వస్తువులు వాడడం వంటి చర్యల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. . ఈవ్యాధి సోకిన వారిని విడిగా గదిలో ఉంచాలి. ఈలక్షణాలు గల రోగుల నుండి నమూనాలను సేకరించడం, వ్యాధిని గుర్తించడం, వ్యాధి నివారణా చర్యలు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను అన్నిజిల్లాల వైద్యాధికారులకు, ప్రభుత్వ ఆసుపత్రుల సూపరిండెంట్లకు పంపించారు. తెలంగాణాలో ఈవ్యాధి వ్యాప్తి నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి. శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేసారు. రాష్ట్రంలోని గాంధీ ఆసుపత్రిలో  ఈవ్యాధికి సంబందించిన, నమూనాల సేకరణ, పరీక్షలు జరపడానికి కేంద్రప్రభుత్వం అనుమతినిచ్చింది. విదేశాలనుండి వచ్చినవారు, స్థానికంగా ఉన్నవారు కూడా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. వ్యాధి అనుమానితులు 040-24651119 కు ఫోన్ చేయాలని సూచించారు.