Telangana

భద్రాద్రికి తమిళి సై

Share with

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో వరద ఉధృతికి 95 గ్రామాలు నీట మునిగాయి. దీనితో 77 చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను అక్కడికి తరలించారు. ముంపుకు గురైన ప్రాంతాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి వరద కారణంగా భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పడిన వైపరీత్యాలను పరిశీలించేందుకు తెలంగాణా రాష్ట్ర గవర్నర్ తమిళి సై భద్రాచలం చేరుకోనున్నారు. నిజానికి ఆమె ఈరోజు డిల్లీలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇచ్చే విందుకు బయలుదేరాల్సి ఉండగా ఆప్రయాణాన్ని రద్దు చేసుకొని, ముంపునకు గురైన భద్రాచల పరిసర ప్రాంతాలలో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి బయలుదేరి రైలులో కొత్తగూడెంకు వెళ్లనున్నారు. గోదావరి వరద ప్రాంతాలలో పర్యటించి, బాధితులను పరామర్శించనున్నారు. తాను బూస్టర్ డోస్ వేసుకున్నాని, దేశ ప్రజలందరికీ ఉచిత బూస్టర్ డోస్ సదుపాయం కల్పించినందుకు, ప్రధానికి ధన్యవాదాలు తెలియజేసారు. తాను రెండవ డోస్ ట్రైబల్ ఏరియా లో వేసుకున్నానని, అక్కడి ప్రజలకు అవగహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని, తెలంగాణలో భారీ వర్షాల కారణంగా  వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. .ప్రతిఒక్కరూ ఆరోగ్యం పై శ్రద్ద తీసుకోవాలని అందరికి విన్నపం చేసారు.

bhadarachalam