12న ఆంధ్రకు ద్రౌపది ముర్ము
భారతదేశ ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగియనుంది. త్వరలో దేశానికి కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. ఎన్‌డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము జూన్ లో నామినేషన్ దాఖలు చేశారు. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్, 21న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో తన అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టడంలో భాగంగా ఆమె ఆంధ్రప్రదేశ్లో ప్రచారం నిర్వహించనున్నారు.ఈనెల 12వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముర్ము సమావేశమవుతారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి లోని సీఎం జగన్ నివాసానికి ఆమె వెళ్లి సీఎం ఇచ్చే తేనేటి విందులో పాల్గొననున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పటికే ముర్ము కు వైయస్సార్సీపి మద్దతు తెలిపింది.