NewsTelangana

కేసీఆర్ సర్కారు తప్పు చేసినా… మోదీ సర్కారు న్యాయం చేస్తోంది-గోయల్

Share with

తెలంగాణలో ధాన్యం, బియ్యం తక్షణం సేకరించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు కేంద్ర వాణిజ్య, ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్. రాష్ట్ర ప్రభుత్వానికి ఇందుకు సంబంధించిన క్లియరెన్స్‌ను FCI ఇస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు సహకారం అందించడం కోసం… ఎంతో తాపత్రయం పడుతుంటే… తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి చింతా లేకుండా పోయిందని గోయల్ విమర్శించారు. పేదలకు ఇంత అన్యాయం చేస్తోన్న ప్రభుత్వం మరోటి లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒక విఫల ప్రభుత్వమని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణలో ఇథనాల్ బ్లెండింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించడం లేదని ఆక్షేపించారు. ఇంధన దిగుమతులు తగ్గితే విదేశీ నిల్వలు పెరుగుతాయని.. కేంద్రం యోచిస్తుంటే… టీఆర్ఎస్ సర్కారు మరోలా ఆలోచిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు దేశ ప్రయోజనాలు నెరవేరేలా కేంద్రం పనిచేస్తోందన్నారు గోయల్. తెలంగాణలో ఇథనాల్ బ్లెండింగ్ యూనిట్ల ఏర్పాటు పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తే… యువతకు ఉపాధి లభిస్తోందన్నారు.