Andhra PradeshNewsTelangana

కేశినేని ఫ్యామిలీ సిత్రాలు..!    

Share with

కేశినేని ఫ్యామిలీలో నెలకొన్న వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై స్పందించిన కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎంపీ కేశినేని నాని ఓ చిన్న వివాదంలో తన కుంటుంబ సభ్యులను బయటకు లాగడం బాధాకరమైన విషయమని , ఈ కారణంగా తనను హైదరాబాద్ పోలీసులు ఆపి , పోలీస్ కమిషనర్ ఆఫీసుకు తీసుకెళ్లి ఎంక్వెరీ చేశారని మీడియా వేదికగా తెలిపారు. విజయవాడ ఎంపీ , టీడీపీ నేత కేశినేని నాని గుర్తు తెలియని వ్యక్తులు తన పేరు , హోదాను వినియోగించుకుని  కొన్ని వ్యవహారాలు నడుపుతున్నారని.. తను విజయవాడ ఎంపీగా  ఉపయోగించే వాహన నెంబర్ TS 07 HW 7777 ను , నకిలీ నెం. సృష్టించి హైదరాబాద్ నగరాలలో తిరుగుతున్నారని ,  మే 27న  పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ మేరకు  పోలీసులు  జూన్ 9న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి , ఐపీసీ 420, 416 , 415 , 499 సెక్షన్స్ కింద కేసు ఫైల్ చేశారు.  

ఈ విచారణలో  భాగంగా సోమవారం జరిగిన తనిఖీల్లో ఆ నెంబర్ ఉన్న వాహనాన్ని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. అదే సమయంలో అందులో ప్రయాణిస్తున్న కేశినేని చిన్నిని పోలిస్ కమిషనర్ ఆఫీసుకు తీసుకెళ్లారన్నారు. విచారణలో అన్ని సవ్యంగా ఉన్నయని తనను  వదిలేశారని తెలిపారు. కానీ వాహనం రిజిస్ట్రేషన్ కేశినేని జానకి లక్షీ పేరుతో ఉందన్న కారణంతో తమ ఇంటి వారి పేర్లను బయట పెట్టడంపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. టీడీపీలో ఓక చిన్న కార్యకర్తను మాత్రమే , పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం కావడమే తమ లక్ష్యమన్నారు.

తన వాహనంపై ఎటువంటి స్టిక్కరింగ్ లేదని తెలిపారు దీనిపై పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారని చేప్పారు. ఆటోనగర్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవం జరపాలని భావించినా దాన్ని కూడా వివాదంగా మార్చరన్నారు. పార్టీ నుండి ఎంపీగా పోటీ చేస్తానని తాను ఎవరిని టిక్కెట్ అడగలేదని స్పష్టం చేశారు. తనపై ఎన్ని విమర్శలు , ఆరోపణలు వచ్చిన వాటిని స్వీకరిస్తానని .. కానీ ఈ విషయంలో ఇంటి వారిని బయటకు లాగితే ఊరుకోనన్నారు. కేశినేని నాని తన సోదరుడని , శత్రువు ఎప్పటికి కాదని , అన్న గెలుపు కోసం పనిచేస్తానని మీడియా వేదికగా తెలిపారు.