NationalNews

సినీ నిర్మాత ప్రేరణా అరోరాపై మనీలాండరింగ్ కేసు

Share with

రూ. 31.6 కోట్ల మోసానికి సంబంధించి బాలీవుడ్ సినీ నిర్మాత ప్రేరణా అరోరాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఐతే ఈడీ ముందు హాజరుకావడానికి మరికొంత సమయం కావాలని ఆమె న్యాయవాది వివేక్ వాస్వానీ కోరారు. ప్రస్తుతం అరోరా ఈడీ ముందు హాజరు కాలేరని చెప్పారు. కేదార్‌నాథ్, టాయిలెట్ – ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్‌మాన్, ఫన్నీ ఖాన్, పరి వంటి చిత్రాలకు ప్రేరణా అరోరా నిర్మాతగా వ్యవహరించారు. షూటర్ అభినవ్ బింద్రాపై నిర్మించిన బయోపిక్‌లో ఆమె భాగస్వామ్యులయ్యారు. ఐతే అరోరా… వాషు భగ్నానీని రూ. 31 కోట్ల మోసం ఆరోపణలపై ప్రేరణ అరోరా ప్రకటన విడుదల చేశారు. మొత్తం వ్యవహారంలో తన ప్రేమయం ఏమీ లేదన్నారామె. సినిమా హక్కులను అక్రమంగా మరొకరికి బదిలీ చేయడం వల్ల తమకు భారీగా నష్టం వాటిల్లిందని… ఆ మొత్తాన్ని తమకు పరిహారంగా చెల్లించాలని నిర్మాత వాషు భగ్నానీ కోర్టులో కేసు వేశారు. క్రిఆర్జ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా ఉన్న ప్రేరణా అరోరా… కేదార్‌నాథ్ సినిమా రైట్స్‌ను రొన్ని స్క్రేవాలకు ఇవ్వడం వల్ల… తమకు రూ. 31.6 కోట్ల నష్టం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. IPC సెక్షన్ 420 మోసం, 120B నేరపూరిత కుట్ర అభియోగాలు మోపారు. మరోవైపు మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సహాయకుడిని ఈడీ అరెస్ట్ చేసింది, ఎన్‌ఎస్‌ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ముంబై మాజీ టాప్ కాప్ సంజయ్ పాండేని సైతం ఈడీ అరెస్ట్ చేసింది.