హైదరాబాద్‌లో ఈడీ మెరుపు దాడులు…
హైదరాబాద్ నగరంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏకకాలంలో ఎనిమిది చోట్ల ఈడీ సోదాలు జరుగుతున్నాయి.ఈ దాడులు క్యాసినో నిర్వహించే లోకల్ ఏజెంట్లైన చీకోటి ప్రవీణ్, మాధవ రెడ్డి ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐఎస్ సదన్ లోని ప్రవీణ్ నివాసం, బోయన్ పల్లిలోని మాధవరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఫెమా కింద ఈడీ కేసు నమోదు చేసింది. గతంలో చికోటి ప్రవీణ్‌పై సీబీఐ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈడీ దాడులకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.
ఇండో – నేపాల్ సరిహద్దుల్లో క్యాసినోలు నిర్వహిస్తున్నట్లు చీకోటి ప్రవీణ్, మాధవ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. పేకాట రాయుళ్లను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి స్పెషల్ విమానాల్లో పశ్చిమ బంగాల్ లోని బాగ్ డోగ్ర ఎయిర్ పోర్టుకు కస్టమర్లను తరలించి, అక్కడి నుండి నేపాల్ లోని హోటల్ మెచి క్రౌన్ లో జూన్ 10 నుంచి 13 వరకు క్యాసినో ఈవెంట్ నిర్వహించారు. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్, డ్యాన్సర్లతో డ్యాన్సులు చేయించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఇందుకోసం ఒక్కో కస్టమర్ నుంచి రూ.3లక్షలు వసూలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఫెమా నిబంధనల కింద కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహిస్తోంది.గతంలోను చీకోటి ప్రవీణ్‌పై సీబీఐ కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది.