గ్యాంగ్ రేపు నిందితులకు బెయిల్
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక కేసుకు సంబందించి కోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. బాలికపై సాముహిక అత్యాచారనికి పాల్పడిన కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురిలో , నలుగురు మైనర్లకు బెయిల్ మంజూరు చేసింది. వీరిలో నలుగురిని జువైనల్ హోమ్ కస్టడీలో ఉంచగా , మరో నిందితునిగా ఉన్న సాదుద్దీన్‌ని మాత్రం చంచల్‌గూడ జైలులో ఉంచిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం వీరిలో ముగ్గురు బాలురకు… జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరు చేసింది. మరో బాలుడికి బెయిల్ మంజూరైన కొన్ని కారణాల వల్ల బెయిల్ అలస్యమైంది. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు బాలురకు బెయిల్ రాగా , మరో నిందితుడు సాదుద్దీన్ బెయిల్ పిటిషన్ గురించి నేడు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.
గతంలో రెండు సార్లు బెయిల్ రిజక్ట్ చేసిన జువైనల్ కొన్ని షరతుల మీద బెయిల్ మంజూరు చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన మే28న జరిగితే , మే31న కేసు నమోదు చేసారు. ఈ కేసులో ఇప్పటికే 17 మంది సాక్షులను గుర్తించిన పోలీసులు కస్టడీలో నిందితులను విచారించారు. నేరం నిరూపించేందుకు అవసరమైన అన్ని ఆధారాలను సేకరించారు. రెండు నెలల్లో విచారణ పూర్తిచేసిన అధికారులు 400పేజీల చార్జిషీట్‌ను తయారు చేసారు. ఈ కేసులో కీలకంగా ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికను, సీసీ పుటేజ్, కాల్ సీడీఆర్‌ను తీసుకున్నారు. నిందితులని కఠినంగా శిక్షించాలని కొందరు అభిప్రాయ పడుతున్న సమయంలో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కేసు ఎటువంటి మలుపు తీరగనుందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపధ్యంలో మెదట జువైనల్ బోర్డు బెయిల్ నిరాకరించడంతో హైకోర్టులో బెయిల్ పిటిషన్ అప్పీల్ చేసుకున్న ఎం ఎల్ ఏ కుమారుడు. ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగగా అతనికి బెయిల్ మంజూరు చేసినట్టు హైకోర్టు తీర్పునిచ్చింది.