పూరి, ఛార్మిని విచారించిన ఈడీ
హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మీలను అధికారులు ప్రశ్నించారు. లైగర్ మూవీ లావాదేవీలకు సంబంధించి వీరిని అధికారులు ప్రశ్నిస్తుండగా.. పలు సంస్థల నుంచి పూరి, ఛార్మి ఖాతాల్లోకి వచ్చిన విదేశీ నిధులపై విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. లైగర్ మూవీలో రాజకీయ నాయకులు పెట్టుబడులు పెట్టినట్లుగా ఈడీ అనుమానిస్తోంది. అయితే.. 15 రోజుల క్రితమే వీరిద్దరికీ ఈడీ నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

