NewsTelangana

ఈడీ చీఫ్‌గా సంజయ్‌ను నియమించినందుకు ప్రధానికి థ్యాంక్స్-కేటీఆర్

Share with

డబుల్ ఇంజిన్ అంటే మోదీ… ఈడీనా అంటూ విమర్శించారు తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. బీజేపీ సర్కారు నిర్ణయాలపై కేటీఆర్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు ఈడీ విచారణ తప్పదంటూ బండి చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు కేటీఆర్. ఈడీ చీఫ్ గా సంజయ్‌ను నియమించిన ప్రధానికి కృతజ్ఞతలంటూ దుయ్యబట్టారు. దేశాన్ని నడిపిస్తున్న మోదీ-ఈడీ ఇదేనని అర్థమవుతోందన్నారు.

మరోవైపు రైళ్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీలు ఎత్తేయడంపైనా కేటీఆర్ విరుచుకుపడ్డారు. రైళ్లలో సీనియర్ సిటిజన్ల రాయితీ ఎత్తేయాలని నిర్ణయించడం దారుణమన్నారు. కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు కేటీఆర్ ట్వీట్ చేశారు. పెద్దలను మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత యువతదేనన్నారు. దేశ వ్యాప్తంగా ఏడు కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ప్రయాణాలు చేయడం కష్టమవుతోందన్నారు కేటీఆర్.